Take a fresh look at your lifestyle.

దళిత కుటుంబంలో పుట్టి ఓయు డాక్టరేట్ అందుకున్న తీగల శివకుమార్.

ఆర్ట్స్ కళాశాల వేదికగా పూలమాలతో ఘనంగా సత్కరించి హర్షం వ్యక్తం చేసిన సదర్శపూర్ గ్రామస్థులు.

మోత్కూర్ ముద్ర న్యూస్:

మోత్కూర్ మండలం సదర్ షాపూర్ గ్రామంలో అత్యంత కటిక పేదరిక కుటుంబం మాదిగ సామాజిక వర్గంలో తీగల యాదగిరి- ఎల్లమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించిన తీగల శివకుమార్ తన చిన్నతనం నుండి అనేక కష్టాలను,కన్నీటిని దిగమిందుతూ డొక్కలు ఎండిన తల్లిదండ్రుల బ్రతుకులు చూసి చలించిన శివకుమార్ ఎలాగైనా ఉన్నత విద్యను అభ్యసించి తమ కుటుంబ పేదరికం తొలగించాలనే కసి,కఠోర దీక్షతో విద్యపై తనకున్న పట్టుదలతో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత కనబరుస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ జియాలజి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సైన్స్ కళాశాలలో జియాలజి డిపార్ట్మెంట్లో “జియాలజీ అండ్ జియో కెమిస్ట్రీ ఆఫ్ పొదిలి గ్రానైట్ , ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ” అంశం పైన ప్రొఫెసర్ (ఏ మ్ డి) జి. నాగేంద్రబాబు, ప్రభాకర్ గారి పర్యవేక్షణలో పరిశోధనలు నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రేటును పొందాడు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు అభినందించారు, తీగల శివకుమార్ మా గ్రామంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి దళితుడు కావడం గర్వ కారణం అన్నారు. నేటి విద్యార్థి లోకానికి ఇతను ఆదర్శంగా నిలిచాడు. పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలు వడదొడుకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుంటారనే నగ్న సత్యాన్ని నిరూపించాడు. ఈ కార్యక్రమంలో తీగల బ్రదర్స్ , పరుశరాములు (మాజీ వార్డ్ మెంబర్),మహేష్, విజయ్, భూపాల్, సురేష్, రాజా సింహం, నరేష్, తీగల శ్యామ్, నాని, చింటూ, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.