Take a fresh look at your lifestyle.

ఈనెల 7న ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో వాహనాల వేలం పాట

 

ముద్ర… తుంగతుర్తి…
ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలకు ఈనెల 7న తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు, గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలలో హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ లు, హీరో హోండా సిడి డాన్, టీవీఎస్ రేస్ ఎడిషన్, టీవీఎస్ విక్టర్, హీరో హోండా ఫ్యాషన్, టీవీఎస్ ఎక్సెల్, బజాజ్ సిటి 125, మహేంద్ర మినీ డీసీఎం, టీవీఎస్ స్కూటీ,ల తోపాటు మొత్తం 16 వాహనాలకు సంబంధించి వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు, వేలం పాట కు నిర్వహించే వాహనాలు చూపెట్టిన ధరలో బహిరంగ వేలం ద్వారా పాట నిర్వహించ బడును, ఇట్టి వేలం పాటలో అధిక ధర పాడిన వారికి వాహనం ఇవ్వబడుతుందని తెలిపారు, వాహనం వేలంపాటలో పాల్గొనే వారు సంబంధించిన వాహనం యొక్క ధరలో 50% ధర చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని అన్నారు, వేలం పాట దక్కని వ్యక్తికి అతడు చెల్లించిన డబ్బు వేలంపాట పూర్తయిన తర్వాత చెల్లించబడుతుందని తెలిపారు, కావున వేలం పాటలో పాల్గొని ఆసక్తి గలవారు కార్యాలయానికి వచ్చి వాహనాలను చూసుకోవచ్చని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.