ముద్ర, మొయినాబాద్: తెలంగాణ తిరుపతి.. వీసా దేవుడుగా పేరొందిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగతున్నాయి.బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకలు శాస్త్రోప్తంగా నిర్వహించారు.గరుత్మంతునికి, ధ్వజస్తంబానికి అభిషేకం నిర్వహించి తిరుమల కిరణాచారి, పరావస్తు రమాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గరుత్మంతుని పటాన్ని పల్లకిలో ప్రతిష్టించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య ధ్వజస్తంభానికి ఆవిష్కరించారు.నవకలశ స్నాపకం, గరుత్మంతుని ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు.గరుడ పటానికి నాలుగు దిక్కుల గరుత్మంతుని రూపాలు ప్రతిష్టించి నైవేధ్యాన్ని సమర్పించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, మురళీ, కిట్టు, కృష్ణమూర్తి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
