Take a fresh look at your lifestyle.

లబ్ధిదారులకు ‘కల్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీ: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ముద్ర ​కూకట్‌పల్లి :
నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం వివేకానంద నగర్‌లోని తన నివాస కార్యాలయంలో కూకట్‌పల్లి మండలం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ మరియు కూకట్‌పల్లి (పార్ట్) డివిజన్లకు చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ. 52,06,032/- (యాబై రెండు లక్షల ఆరు వేల ముప్పై రెండు రూపాయల) విలువైన కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
తాజా మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తదితరులు.
​ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా గాంధీ పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు అండగా నిలుస్తున్నందుకు ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.