Take a fresh look at your lifestyle.

మరో ఎనిమిదేళ్లు తెలంగాణలోనే ఉంటా: రేవంత్ రెడ్డి రాజకీయ ధోరణులు, కేంద్రానికి హెచ్చరికలు

దేశ రాజకీయాల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయం
బీఆర్ఎన్ నేతలే తెలంగాణలో నన్ను హీరో చేశారు
ఇప్పటికీ, ఎప్పటికీ తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ :

తాను మరో ఎనిమిదేళ్ల పాటు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల అరంగేట్రం గురించి ఆలోచిస్తానని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో దేశ రాజకీయాలకు తాను అవసరమని పార్టీ భావిస్తే, ఆ నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేస్తున్నానని చెప్పారు. దేశంలోనే తెలంగాణ డీఎన్ఏ భిన్నమైందన్న ఆయన ఇదొక వైబ్రెంట్ ప్లేస్ అని కొనియాడారు. తెలంగాణకు, గాంధీ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. తాను ఒక నాయకుడిలా కాకుండా, కార్యకర్తగానే భావిస్తానని, వారి కష్టనష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఓ మీడియా ఛానెల్ డిబెట్ లో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలోని ‘విలన్ల’తోనే ప్రజలు తనను ‘హీరో’ను చేశారని సీఎం.. బీఆర్ఎస్ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రామాయణంలో రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడికి అంత పేరు వచ్చిందన్న ఆయన తెలంగాణలో గత పాలకుల తీరుతోనే కాంగ్రెస్‌కు, తనకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం మండిపడ్డారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న ‘త్రీడీ పాలసీ’కి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశం మొత్తం ఏకం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆయన ఆరోపించారు. వెంకయ్య నాయుడుని రాష్ట్రపతిని చేయకుండా, కేవలం ఉపరాష్ట్రపతి పదవితో ఎందుకు సరిపెట్టారు?” అని ప్రశ్నించారు. కేంద్రంలో హోంశాఖ వంటి కీలక బాధ్యతలను దక్షిణాది నేతలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాదికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎదిగారని, రాజకీయ వివక్ష కేవలం బీజేపీలోనే కనిపిస్తోందని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.