Take a fresh look at your lifestyle.

సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. సింధూజ, తహశీల్దార్ వినోద్ తో కలిసి శుక్రవారం రోజున కథలాపూర్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ, మోడల్ స్కూల్, హాస్టల్ లను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆరోగ్య విద్యను అందించారు. అనంతరం హాస్టల్ గదులు, వంటగది, స్టోర్ రూమ్, బాత్ రూమ్ లు తనిఖీ చేసి వార్డెన్ కు తగు సూచనలు చేసారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీధర్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అభిషేక్, ఏఎన్ఎం. శిరీష, ఆశా కార్యకర్త దేవిక, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అనిత, జూనియర్ కాలేజీ ఇంచార్జి ప్రిన్సిపల్ అచ్యుత్ రాజ్ అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.