Take a fresh look at your lifestyle.

మద్దిమడుగు బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న గువ్వల

  • అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు అమల దంపతుల ప్రత్యేక పూజలు.

ముద్ర, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం లో హనుమజ్జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం మండల పరిధిలోని మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ని మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు ధర్మ పత్తి అమల దర్శించుకునీ, ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నరు.ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ తన ప్రస్తానానికి ఎంతో ప్రత్యేకమైన సంబంధం ఉందని ఎంతో మహిమగల మద్దిమడుగు అంజనేయ స్వామికి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అభిమానులు ఎవరు కూడా అధైర్య పడవద్దని రాబోయే రోజులన్నీ అంజన్న దయవల్ల మనమేనని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాంబాబు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీను, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ మాదిగ, పార్టీ నాయకులు వెంకటయ్య, ముత్యాలు, అంజి రెడ్డి, హన్మంత్ రెడ్డి, శరత్ యాదవ్, ఎల్లయ్య యాదవ్, అంజి, వెంకటేష్, తారసింగ్, స్థానిక కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.