Take a fresh look at your lifestyle.

ఎలాంటి అపోహలు లేకుండా రక్తదానం చేయొచ్చు

  • ఐఏంఏ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు డా. గంగా సాగర్.
  • ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు సన్మానం.

కోరుట్ల/మెట్పల్లి, ముద్ర విలేకరి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ రక్తదాతల అనుసంధాన కర్తలను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏంఏ అధ్యక్షులు డా. గంగా సాగర్ విచ్చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 38 వేల మందికి రక్తం అవసరం అవుతుందని, ఆ రక్తాన్ని ఎటువంటి కృతిమ పరికరాలతో తయారు చేసేది కాదని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. రక్తం అవసరమైన పేషెంట్ కు మరొక వ్యక్తి రక్తాన్ని పరీక్ష నిర్వహించి అనంతరం స్వయంగా తీసి పేషెంట్ కు ఎక్కించడం జరుగుతుంది. అలాంటి రక్తాన్ని అవసరం అయినప్పుడు రక్తదాతలను పంపించి, రక్తదాతల అనుసంధాన కర్తలను అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు వ్యవస్థాపకులు పుల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఐఏంఏ అధ్యక్షులు డా. గంగా సాగర్ మాట్లాడుతూ 18 సంవత్సరల వయస్సు నిండిన యువతి, యువకులు ఎలాంటి అనుమానాలు, అపోహలు లేకుండా రక్తదానం చెయ్యవచ్చని, ప్రజలలో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం కోసం ఐఏంఏ తరుపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏంఏ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు డా. గంగా సాగర్, ప్రధాన కార్యదర్శి డా. రవి, వివిధ స్వచ్చంద సంస్థల నిర్వాహకులను అభినందించి శాలువాతో సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.