కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల కోర్టు ఆవరణంలో జూనియర్ సివిల్ జడ్జి కసుల పావని ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించబడింది. మామిడిపల్లి హరిణి దంపతుల మధ్య చిన్నపాటి కలహాలతో దూరంగా ఉంటున్నారు. శనివారం రోజు జరిగిన లోక్ అదాలత్ లో సివిల్ జడ్జి కసుల పావని సమక్షంలో లాయర్లు అందరూ ఒక్కటై దంపతుల మధ్య రాజీ కుదిర్చి వారిని ఒక్కటి చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, కోశాధికారి చింతకింది ప్రేమ్, జాయింట్ కార్యదర్శి చిలివేరి రాజ శేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కడకుంట్ల సదాశివ రాజు, గోనే సదానంద్ నేత తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.