Take a fresh look at your lifestyle.

రామ్‌ చరణ్ ‘పెద్ది’కి కొత్త టార్గెట్‌?.. రిలీజ్ డేట్‌పై హాట్ టాక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడన్న ప్రచారం అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.

ముందుగా ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించినప్పటికీ, తాజా పరిస్థితులను బట్టి ఆ డేట్‌కి సినిమా థియేటర్లకు రావడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, కీలక షెడ్యూల్స్ మిగిలి ఉండటం, అలాగే భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని సమాచారం.

ఇదిలా ఉండగా, తెలంగాణలో టికెట్ రేట్ల అంశం కూడా రిలీజ్ ప్లానింగ్‌పై ప్రభావం చూపే అవకాశముందని తెలుస్తోంది. అందుకే అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో ‘పెద్ది’ని 2026 దసరా పండుగకు విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది. మాస్ సినిమాలకు దసరా సీజన్ అనుకూలంగా ఉండటంతో, రామ్ చరణ్ మాస్ అవతారానికి అదే సరైన టైమ్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.