మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అన్న విషయం తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనవరి 31న ఆమెకు డెలివరీ జరగనుందని ప్రచారం సాగుతోంది. దీంతో కొణిదెల కుటుంబంలో సందడి మొదలైందని టాక్.
డెలివరీ డేట్ దగ్గర పడటంతో ఉపాసన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుండగా, రామ్ చరణ్ కూడా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి భార్యకు అండగా ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ట్విన్స్ పుట్టబోతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆసక్తిని మరింత పెంచింది.
ఇప్పటికే ఒక పాప ఉన్న నేపథ్యంలో ఈసారి వారసుడా? లేక మరో పాపా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఏదేమైనా కొణిదెల కుటుంబంలో మరో కొత్త అతిథి రాబోతున్నాడన్న వార్తతో మెగా అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.