Take a fresh look at your lifestyle.

సూర్య ప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ రామ చంద్ర మూర్తి.. శ్రీవారికి చంద్రప్రభ వాహన సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరిలో వసంత నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ రామాయణ పారాయణ క్రతు మహాయజ్ఞంలో భాగంగా ఉదయం యాగశాలలో పుణ్యాహవాచనం, కుంభస్థాపనం, అరణి మథనం వంటి వైదిక కార్యక్రమాలను జరిపి అగ్ని ప్రతిష్ట గావించారు. అనంతరం శ్రీమద్రామాయణ పారాయణము, హోమము నిర్వహించి శ్రీ రామ చంద్ర మూర్తిని సూర్య ప్రభ వాహనం మీద ఊరేగించారు.


సాయంత్రం శ్రీవారి చంద్రప్రభ వాహన సేవను అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా ఊరేగింపుగా నిర్వహించారు. ఈ దివ్య ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొని గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలంకరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి కి సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.