ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
పవిత్ర రంజాన్ పండగను జిల్లాలోని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. రంజాన్ మాసం ముగిసిన శుభవేళ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ… రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారని పేర్కొన్నారు. ఈ నెలలో ఆచరించే ఉపవాస దీక్షలు మనుషుల్లో ఆత్మశుద్ధి, క్రమశిక్షణ, దాతృత్వ భావనలను పెంపొందిస్తాయని చెప్పారు.
మాసాంతంలో వచ్చే ఈద్ పండుగ సర్వ మానవాళి సమానత్వాన్ని ప్రతిబింబించే పండుగగా నిలుస్తుందని, ప్రేమ, సహనం, సహకారం వంటి విలువలను బలపరుస్తుందని ఆయన తెలిపారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. నెల రోజుల పాటు కఠిన నియమాలతో ఉపవాసాలు ఆచరించిన అనంతరం, చంద్ర దర్శనం అనంతరం పండుగను జరుపుకోవడం రంజాన్ ప్రత్యేకత అని శాసనసభ్యులు గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం చంద్రుడు దర్శనమివ్వడంతో ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరులకు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.