Take a fresh look at your lifestyle.

బస్తీమే సవాల్…!

 

– దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సవాల్
– ఇద్దరి మధ్య మాటల యుద్ధం
– మధుసూదన్ రెడ్డి రాజీనామా చేసి గెలిస్తే తాను ఇకముందు ఎమ్మెల్యే కు పోటీచేయనంటున్న ఆల
– ఎమ్మెల్యే అవినీతి లో రాజ్యమేలాడు.. ఇసుక దందా లో అరితేరారు
– బీ ఆర్ ఎస్ నేతల పై అక్రమ కేసు లు పెట్టిస్తున్నారు
– నా పై అనవసర ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు
– మీడియా సమావేశం లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
దేవరకద్ర నియోజకవర్గం లోని చెరువుల్లో నల్ల మట్టిని కొల్లగొట్టి రూ. కోట్లు సంపాదించావని… ప్రతి పనికి ఒక రేట్ నిర్ణయించి ఎమ్మెల్యే పదవికే మచ్చ తెచ్చావని బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇటీవల తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఎమ్మెల్యే మాటలకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే శుక్రవారం దేవరకద్ర లో మీడియా సమావేశం పెట్టి ప్రస్తుత ఎమ్మెల్యే పై మాటలతో దుమ్మెత్తి పోశారు. మాజీ మాటల్లోనే… ప్రజలు మీకు అవకాశం ఇచ్చారని మేము ఏమి అనడం లేదు…మా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తుంటే ఊరికే కూర్చునే అలవాటు లేదు..రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని భావించాం.. కానీ మధుసూదన్ రెడ్డి చదువుకున్న మూర్కుడు.. ఆయన మంచి అనిపించుకునేందుకు మా పై బురద చల్లుతున్నారు… ఇకపై ఆయన తీరును ఎండగడతామని ఆలవెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
మా హయాంలో తాను సివిల్ ఇంజినీర్ గా పని చేసి ఎమ్మెల్యే గా సొంతంగా ఆలోచించి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించామన్నారు.
పెద్ద ,ఊక చెట్టు వాగుల పై 36 చెక్ డ్యాంల నిర్మాణం చేసి నీటిని ఒడిసిపట్టమన్నారు.అతి తక్కువ ఖర్చుతో బండర్ పల్లి వద్ద చెక్ డ్యామ్ నిర్మించామని,కరివెన రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లో లేదని, సొంతంగా అక్కడ తిరిగి రిజర్వాయర్ నిర్మాణం చేయొచ్చని కేసీఆర్ ను ఒప్పించామన్నారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్వకేట్ అని,ఆయన న్యాయవాద తెలివి అక్రమ కేసులు,సెక్షన్ లు, ఎఫ్ ఐ ఆర్,ఛార్జ్ షీట్ ఎలా చెయ్యాలో అని ఆలోచిస్తుంటారన్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం మార్చమని అడిగిన వారిపై కేసు పెట్టి జైలులో వేశారన్నారు.కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్న నల్లమట్టిలో అవినీతి చేయలేదన్నారు.రిజర్వాయర్ లు నిర్మించాలంటే కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం ఉంటుందనే విషయం ఎమ్మెల్యే కు తెలియదన్నారు.చెరువుల్లో మట్టి తీసి రిజర్వాయర్ నిర్మించామని, దీంతో చెరువుల్లో నీటి నిల్వ పెంచినమన్నారు.కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్దాం.. ఇద్దరం ప్రమాణం చేద్దాం..నల్లమట్టి అమ్ముకోలేదని ప్రమాణం చేస్తానని,100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని నువ్వు కురుమూర్తి స్వామి దగ్గర బాండు పేపర్లు రాసి సంతకం పెట్టావు..ఇద్దరం ఒకేసారి ప్రమాణం చేద్దాం..దేవుడు ఎవరు శిక్షిస్తాడో చూద్దామని ఆల సవాల్ చేశారు.నీ పని తీరు మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేయాలని,నువ్వు గెలిస్తే నేను ఎమ్మెల్యే గా మళ్ళీ పోటీ చేయనని ప్రస్తుత ఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తమ్ముడు చెక్ డ్యామ్ లు కడితే అప్పుడే కొట్టుకుపోయిందని,నియోజకవర్గంలో ఇసుక దందాలో అరితేరారని,ప్రతి బండికి ఓ రేట్ కట్టి వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పై మండిపడ్డారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఏం చేస్తున్నావో అంతా తెలుసు… ఇకముందు బాష మార్చుకోక పోతే వీడియోలు, ఫోటో లు బయటికి వస్తాయని ఎమ్మెల్యే ను మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.