Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈరోజు నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ చెవ్వ ప్రమోద్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, చందు, శ్రీనాథ్ గౌడ్, కృష్ణ, పర్వతాలు, పరుశరామ్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.