Take a fresh look at your lifestyle.

ఉద్యోగి జీవితంలో పదవి విరమణ సహజం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :

ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమని జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు.శనివారం రోజు పదవి విరమణ పొందుతున్న అధికారులు ధశరత్ ఎస్ఐ, యాదగిరి ఏఎస్ఐ లను ఘనంగా సత్కరించి,వీడ్కోలు పలికారు.పదవి విరమణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పదవి విరమణ పొందుతున్న అధికారులను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
ధశరత్, ఎస్ఐ – (1983) సంవత్సరంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా నియామకమై,నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి,సమర్థవంతంగా సేవలందిస్తూ సర్వీస్ మొత్తంలో ఏచిన్న రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్-ఇన్స్పెక్టర్‌గా ఎదగడం వారి కృషికి నిదర్శనం అన్నారు. స్టేషన్ హౌస్ అధికారిగా ఇంద్రకర్, మునిపల్లి,వట్‌పల్లి,నాగల్‌గిద్ద పోలీసు స్టేషన్‌లలో సమర్థవంతంగా విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందారని పేర్కొన్నారు.
యాదగిరి, ఏఎస్ఐ – (1992) సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌లలో సాధారణ విధులతో పాటు క్రైమ్ డ్యూటీలు నిర్వహిస్తూ తనకు కేటాయించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించారని తెలిపారు. సర్వీస్ మొత్తంలో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొంది అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ హోదాకు చేరడం వారి ప్రతిభకు నిదర్శనం అన్నారు.
ధశరత్ ఎస్ఐ, యాదగిరి ఏఎస్ఐలు పోలీసు శాఖకు అందించిన సేవలు మారువలేనివని కొనియాడారు.రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి వారికి రావలసిన అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రిటైర్మెంట్ అనంతరం వారికి ఆయురారోగ్యాలు కలిగి, కుటుంబ సభ్యులతో ఆనందంగా మిగిలిన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ, పోలీసు శాఖ తరపున వారికి మరియు వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి,ఎఆర్ డియస్పీ నరేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ అశోక్, మోహనప్ప,ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్,ఆర్ఐ లు రాజశేఖర్, డానియెల్ రిటైర్డ్ అవుతున్న అధికారుల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.