Take a fresh look at your lifestyle.

అమరవీరుల త్యాగాలకు నివాళి – తారా కళాశాలలో షహీద్ దివస్ నిర్వహణ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి,
తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డిలో ఎన్ఎస్ఎస్ విభాగాలు,జువాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) ఘనంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ,భగత్ సింగ్, రాజ్‌గురు,సుఖ్‌దేవ్ వంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 23న దేశవ్యాప్తంగా షహీద్ దివస్‌ను నిర్వహిస్తామని తెలిపారు. భారతమాత స్వాతంత్ర్యం కోసం వారు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి అశవులు బాసినారని, అటువంటి మహనీయులు అందరికీ ఆదర్శప్రాయులని పేర్కొన్నారు.
అమరవీరుల నిస్వార్థ సేవలు, ప్రాణత్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని, నేడు మనం స్వేచ్ఛగా జీవించ గలుగుతున్నామని అన్నారు.వారి ఆశయాలను సాకారం చేయడానికి నేటి యువత ఉన్నత లక్ష్యాలతో సామాజిక సేవ,దేశ సేవలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ సదయ కుమార్, డాక్టర్ వాణి, డాక్టర్ సిహెచ్ జోస్నా, అధ్యాపకులు మిథున్ కుమార్ రాథోడ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.