Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

 

ముద్ర, గద్వాల:

విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గద్వాల‌ ఎమ్మెల్యే బండ్ల‌ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం గద్వాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు, మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణంతో విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాలలోని ఏకైక ప్రభుత్వ బాలికల ఉన్నంత పాఠశాల అన్నది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని మంచిగా చదువుకొని భవిష్యత్తులో అత్యంత స్థాయికి ఎదగాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు దూరం ప్రాంతాలకు వెళ్లి చదువుకునే అవసరం లేకుండా గద్వాల లోనే అన్ని రకాల విద్య అవకాశాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో సరైన విద్య లేక వెనుకబడిన ప్రాంతంగా పిలవబడేది కానీ నేడు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి విద్యాపై ప్రత్యేక పెట్టడం జరిగింది ఇటీవలే మెడికల్ లో ఎంబిబిఎస్ సీట్లను ఎనిమిది మంది విద్యార్థులు సాధించడం జరిగింది గద్వాల ప్రాంతం నుండి అదేవిధంగా వివిధ రకాల పోలీస్ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయిలలో కూడా విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం జరిగిందన్నారు. కే.టి దొడ్డి మండలంలో సైనిక్ గురుకుల పాఠశాల నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేసి పనులను ప్రారంభించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు తెలిపారు. అదేవిధంగా కాకులారంలో కూడా ప్రభుత్వ పాఠశాలను త్వరలో భూమి పూజ చేస్తామన్నారు. జిల్లాకు నవోదయ కూడా మంజూరు కావడం జరిగింది భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా విద్యకు సంబంధించిన అన్ని రకాల కోర్సులు విద్యాపరమైన వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి యాదవ్ వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి, హెచ్ఎం జహురుద్దీన్, ఉపాధ్యాయులు , కాంట్రాక్టర్, నాయకులు,‌ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.