Take a fresh look at your lifestyle.

పాక్పట్ల ఉన్నత పాఠశాలకు 5 కంప్యూటర్ల వితరణ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సామాజిక బాధ్యత గా రూ.1 లక్ష విలువైన ఐదు కంప్యూటర్లను బహూకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు సామాజిక సేవలో భాగంగా విరాళంగా ఇచ్చామని వీటిని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏం.చంద్ర శేఖర రావు, ఇన్ఫినిటీ రీజనల్ మేనేజర్ రామ్ రెడ్డి అనిల్ కుమార్, గ్రామస్తులు రమేష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, గంగారెడ్డి, రాజారెడ్డి, రమేష్, పంచాయతీ కార్యదర్శి భూషణ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.