Take a fresh look at your lifestyle.

చోరీకి గురైన ఫోన్ల అందజేత

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది మాసాలుగా చోరికి గురైన రూ.12 లక్షల విలువైన 100 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో పోలీసులు మొబైల్ దొంగతనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి CEIR పోర్టల్‌ సహకారంతో రికవరీ చేశారు. మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు రూ.2.56 కోట్ల విలువైన ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.