- జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ కోయ వెంకటేశ్వర రావు.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: గణితం సైన్స్ అంటేనే అనేకమంది విద్యార్థులు భయపడతారని అది ఒక అపో మాత్రమే అని దానిని వీడితే సులువుగా రాణించవచ్చని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ కోయ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్సు , శాస్త్రీయత గణితంలో మెలకువలు అనే అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.సులువుగా గణితం చేయడం లెక్కలు అంటే భయం పోగొట్టడం తదితర అంశాలను కూలంకషంగా ఉదాహరణలతో విద్యార్థులకు . అపోహలు వీడి సైన్స్ గణితం పై పట్టు సాధించేందుకు నిత్యసాధన చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో గణిత నిపుణులు చంద్రయ్య నల్లగొండ జిల్లా జీవీ సభ్యులు కరీం,జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు చంద్రశేఖర్ కార్యదర్శి నెహ్రు ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశారు.గ్రామ పెద్దలు తలసాని కిషోర్ సమకూర్చిన గణితం సులువుగా రావడానికి క్యాలిక్యులేటర్ గేమ్స్ అనే పుస్తకాలను 200 మంది విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, శ్రీనివాసులు, శ్యామల దేవి, ఆనంద రెడ్డి, నారాయణ గౌడ్, నరసింహ, పాండు, యాదయ్య గౌడ్ నరసింహ గౌడ్ మన్సూర్, ప్రభావతి ,మహేష్, జైపాల్ ,దాసు, విద్యార్థులు పాల్గొన్నారు.