రామగుండంలో అరాచక పాలన ప్లీజ్ ఒక్కసారి అవకాశం అంటూ గెలిచిన ఎమ్మెల్యే ఫుల్ టైం ఎమ్మెల్యే నా విజిటర్ ఎమ్మెల్యే నా!
- వ్యాల హరీష్ రెడ్డి బిఆర్ఎస్ నేత.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండంలో ప్రజాస్వామ్యం లేదని ఎమ్మెల్యే ను ఏ సమస్యపై అడిగేందుకు ప్రజలు వెనుకడుగు వేస్తున్నారని భయాందోళనలు అరాచకాలు కూల్చివేతలతో అలజడి సృష్టిస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని బి ఆర్ ఎస్ నాయకుడు (ఎన్ ఆర్ ఐ) వ్యాల హరీష్ రెడ్డి ఎమ్మెల్యే వ్యవహారం షాడో ఎమ్మెల్యే వివరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలు స్వర్ణ యుగం చూసారనీ, రేవంత్ రెడ్డి అరాచక పాలన,ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందనీ, రామగుండంలో కూల్చడం తప్పా అభివృద్ధి లేదనీ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆరోపించారు.బి ఆర్ ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి హైదరాబాద్ నుండి రామగుండం నియోజకవర్గంకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం బి పవర్ హౌజ్ గడ్డ వద్ద, మున్సిపల్ టి జంక్షన్ వద్ద, గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద ఘనస్వాగతం పలికారు.ఖని చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి, జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డప్పు చప్పుళ్ళ తో బి ఆర్ ఎస్ నాయకులు,వి హెచ్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు,అభిమాను లతో కలిసి ర్యాలీగా ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు.తదనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వాల్య హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులకు రైతు బీమా, రైతు బంధు,రుణమాఫీ జరిగాయని, కాంగ్రెస్ పాలనలో రైతు బీమా ఊసేలేదని, రైతు బంధు,రైతు రుణమాఫీ కొంతమందికే జరిగిందని ఆరోపించారు.ఇక రామగుండంలో కూల్చివేతలు తప్పా 18 నెలల కాలంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు కూల్చడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ మరోచోట కట్టుకోమని తెలుపడం మున్సిపల్ అధికారులు కూల్చడం ఇదే జరుగుతుందని,రామగుండం ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులు చెప్పడం మాత్రం 900 కోట్లు వచ్చాయని అంటున్నారని,మరి 900 కోట్ల రూపాయల అభివృద్ధి ఎందుకు కనబడడం లేదన్నారు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఏడ్చిన రాజ్ ఠాకూర్ ఇప్పుడు ప్రజలను,వ్యాపారులను ఏడిపిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కళ్లలోకి సూటిగా చూసి తనకు ఈ పని చేసిపెట్టండి అని అడిగే దైర్యం సామాన్య ప్రజలకు లేకుండా అయిందని అంటే అంతలా భయబ్రాంతులకు గురిచేసేలా ఇక్కడి ఎమ్మెల్యే పాలన ఉందని అర్థమవుతుందని అన్నారు. బూడిద, ఇసుక, మట్టి ద్వారానే ప్రతిరోజూ ఎమ్మెల్యే ఖజానా నుడుతున్నట్లు ఇక్కడ పబ్లిక్ టాక్ వినవస్తుందని తెలిపారు. రామగుండం ప్రజలు రాష్ట్రంలోనే భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారని అందుకు తగినట్లు ప్రజలకు మంచి పనులు చేయండని స్వాగతిస్తామని అన్నారు. పార్ట్ టైమ్ ఎమ్మెల్యే లాగా కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఫుల్ టైమ్ ఎమ్మెల్యేగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు, మంత్రుల సభలకు అనుమతులు ఇస్తూ,బి ఆర్ ఎస్ పార్టీకి అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు చటం ప్రకారం నడుచు కోవాలని అధికార పార్టీకి కొమ్ము కాయొద్దని హితవుపలికారు.ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, తస్లిమా భాను, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
