మంథని, ముద్ర విలేకరి: మంథనిలో సిఐటియు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 282 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ కార్మికులు మే డే స్ఫూర్తితో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పని దినాన్ని అమలు చేయాలని జీవో నెంబర్ 282ను తీసుకువచ్చిందని,ఇది చాలా అన్యాయమని అన్నారు నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తున్న నరేంద్ర మోడీ విధానాలలో కాంగ్రెస్ ప్రభుత్వం భాగస్వామ్యం కావద్దని అన్నారు.10 గంటల పని దినాలను తీసుకువచ్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిప్పకుర్తి చందు,సింగారపు గట్టయ్య,మల్లేష్,రాజేష్,జంపయ్య, భాగ్య ,పోసమ్మ తదితరులు పాల్గొన్నారు.