Take a fresh look at your lifestyle.

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు వద్దన్న రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న అధికారులు

 

మహాదేవపూర్, ముద్ర:

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం ఉంది నోటీసులు అందుకున్న రైతులు తమకు చిన్న కాలుష్యం కాలువల వల్ల నష్టం జరుగుతుందని అధికారులతో వాదించారు. ఇప్పటికే ప్రతి రెండు ఎకరాలకు ఒక బోరు బావి ఉందని రేపు ద్వారా తాము వ్యవసాయం చేస్తున్నామని కెనాల్ నీళ్ల వలన పంటలకు నష్టం వాటిల్లుతుందని వాదించారు. సుముఖంగా ఉన్న రైతులు ముందుకు రావాలని తాసిల్దార్ ప్రహ్లాద్ కోరగా తాము సుముఖంగా లేమని రైతులు దిగేసి చెప్పటంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న మహదేవపూర్, కొత్తపేట గ్రామ శివారు రైతులు హాజరైనది సమావేశంలో గ్రామ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్, ఎమ్మార్వో, ఎంపీడీవో, జిపిఓ, నీటిపారుదల శాఖఏఈ రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.