Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగ ఇంటర్ పరీక్షలు

  • పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని అల్పోర్స్ జూనియర్ కాలేజి,ఎస్ కె ఎన్ ఆర్,ఉమెన్స్ కళాశాల,శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, ఎన్ఎస్వి జూనియర్ కాలేజీ లో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల సెంటర్ లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.జిల్లాలో మొత్తం విద్యార్థులు 14,450 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారుని వీరి కోసం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పరీక్ష కేంద్రాల పరిసరాలు ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు.ఒక నిమిషం ఆలస్యంనీ తాజాగా 5 నిమిషాలు సడలిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనీ తెలిపారు.ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు.కలెక్టర్ వెంట, ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, తహసీల్దార్ రామ్ మోహన్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.