ముద్ర నడిగూడెం…
నడిగూడెం మండల విద్యాధికారిగా
వల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వనం సత్యనారాయణ మండల విద్యాధికారిగా పదోన్నతి పొంది శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పనిచేసిన ఎంఈఓ భాజ ఉపేందర్, ఉపాధ్యాయులు నూతన ఎంఈఓ ను శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి రామదాసు నాగరాజు, బాబు, సుబ్బారావు ఎం ఆర్ సి స్టాప్ నాగరాజు రాజశేఖర్ రామారావు గురుస్వామి గోవర్ధన్ అంజన్ తదితరులు పాల్గొన్నారు.