Take a fresh look at your lifestyle.

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  • మాజీ మంత్రి జీవన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి.
  • ఘనంగా మేడే వేడుకలు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.మేడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉందంటే పారిశుద్ధ్య కార్మికుల నిరంతర కృషి తోనే అన్నారు.ఎవరు చేయనటువంటి పని కార్మికుల మురుగు కాల్వలు దిగి వాటిఅన్నిటిని పారిశుద్ధం చేస్తున్నారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు నిత్యం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదని, కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని మాజీ మంత్రి అన్నారు.కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.ప్రజాసేవలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని వారికి పలు సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రాధాన్యతను ఇవ్వనుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్లు, దాసరి లావణ్య ప్రవీణ్, పల్లె గంగాసాగర్, చుక్క నవీన్, కళ్ళపెల్లి దుర్గయ్య, గుగ్గిళ్ళ హరీష్, పుప్పాల అశోక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మారుతి,రాము, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.