Take a fresh look at your lifestyle.

రాజేంద్రనగర్ లక్ష్మిగూడలో చదరపు గజం రూ.51 వేలు

హౌసింగ్ బోర్డు ఒపెన్ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన
హాట్ కేకుల్లా అమ్ముడైన 14 ప్లాట్లు
హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన లభించింది. ఇక్కడి 14 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు ఈ నెల 2 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా బుధవారం నాడు నిర్వహించిన వేలం పాటలో 49 మంది కొనుగోలుదారులు పాల్గొనగా ప్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈ భూముల చదరపు గజానికి రూ. 32 వేల ను అప్ సెట్ ప్రైజ్ గా (కనీస ధరగా) నిర్ధారించగా, వేలం పాటలో గరిష్టంగా చదరపు గజం రూ.51 వేలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ విపి గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 14 ప్లాట్ల విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. హసింగ్ బోర్డు సౌత్ డివిజన్ ఎగ్జుక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ భూముల విక్రయాల్లో అతి తక్కువగా చదరపు గజానికి రూ.36 వేల ధర పలకగా, సగటున చదరపు గజం భూమి రూ. 44,285 ధర పలికింది.

వేలం ముఖ్యాంశాలు
• మొత్తం విక్రయించిన ప్లాట్లు 14
• అప్సెట్ ధర: చదరపు గజానికి ₹32,000
• అత్యధిక బిడ్: చదరపు గజానికి ₹51,000
• కనిష్ట బిడ్: చదరపు గజానికి ₹36,000
• సగటు బిడ్: చదరపు గజానికి ₹44,285

Leave A Reply

Your email address will not be published.