ముద్ర, కుత్బుల్లాపూర్:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 129 – సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లోని మారుతి మెడికల్ హాల్ వద్ద పుప్పాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిథిగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు ద్వారా పేద ప్రజలకు సేవలను అందిస్తున్న పుప్పాల ఫౌండేషన్ డైరెక్టర్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ పుప్పాల భాస్కర్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యానికి నా అభినందనలు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఏ ఉచిత వైద్య శిబిరాన్ని నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం బస్తీలోని హరి హర క్షేత్రం శివాలయం నిర్మాణ పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, సీనియర్ నాయకులు మధుమోహన్, ఫెరోజ్, సాజిత్, ప్రశాంత్, బషీరుద్దీన్, ప్రభుదాస్, రవి, ముకుందం, ప్రభుదాస్, కోల శ్రీకాంత్, హేమలతా రెడ్డి, లావణ్య, ధనలక్ష్మి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆర్టీసీ లక్ష్మీనారాయణ, భద్రప్ప, సంజీవరెడ్డి, వరప్రసాద్, అనిల్, రవితేజ, సుమన్, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.