ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గత నెల 29న భూ సంబంధ వివాదం కారణంగా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగిన రైతు శ్రీధర్ మంగళవారం మృతి చెందారు. భూ సంబంధ సమస్యతో సారంగాపూర్ మండలం ఆలూరు కు చెందిన శ్రీధర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.