– కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు గుదిబండ గా మున్సిపల్ ఎన్నికలు
– అధిక స్థానాలు గెలవాలని అధిష్టానం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్
– ఇప్పటికే అభ్యర్థుల గెలుపునకు పలు చోట్ల ఎదురీదుతున్న ఎమ్మెల్యే లు
– రెండేళ్ల లో ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ల తీరును ఎండగడుతున్న బీజేపీ,
బీ ఆర్ ఎస్
– కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు ధీటుగా ప్రచారం చేస్తున్న బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే లు
– నియోజకవర్గం లోనే తిష్ట వేసిన మూడు పార్టీల నేతలు
– కాంగ్రెస్ అభ్యర్థుల తరపున పాలమూరు లో ఇప్పటికే ప్రచారం చేసిన మంత్రి దామోదర
– బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ ప్రచారం
– బీ ఆర్ ఎస్ అభ్యర్థులను పట్టించుకోని రాష్ట్ర నాయకత్వం
…………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
‘ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు
రెఫరండంగా మారాయి.ఇదివరకే అధికార పార్టీ ఎమ్మెల్యే లకు, డీసీసీ అధ్యక్షులకు అధిష్టానం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. జిల్లా లోకి ఒక కార్పొరేషన్ ( మహబూబ్ నగర్ ), 18 మున్సిపాలిటీల పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అల్టిమే టం ఇచ్చింది. దీంతో జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లు,డీసీసీ అధ్యక్షులు డివిజన్, వార్డుల్లో విశ్రుతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కు, పోలింగ్ కు సమయం కేవలం 15 రోజుల సమయం ఉండడం తో ప్రచారానికి ముమ్మరంగా తిరుగుతున్నారు. ఈ నెల మూడు న విత్ డ్రా సమయం ముగియడం, 8 రోజులు మాత్రమే ప్రచార సమయం ఉండడం కూడా ఎమ్మెల్యే ల ప్రచారాసమయంనికి సరిపోకపోవడం తో ప్రతి వార్డు ల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఓటర్ల ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ధీటుగా బీజేపీ, బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే లు ప్రచారం లో ముందుకెలుతున్నారు.
…………………………………
అందరి దృష్టి పాలమూరు పైనే :
……………………………………
ఉమ్మడి జిల్లా లో మహబూబ్ నగర్ ఒక్కటే కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చెందింది. మొదటి సారిగా ఈ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో మేయర్ పదవి దక్కించుకోవాలని మూడు పార్టీ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 60 డివిజన్ లలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.ఇక్కడి 1.98 లక్షల ఓటర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.ఇప్పటికేవైద్య, ఆరోగ్య శాఖా, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజానర్సింహా ఒక పర్యాయం ప్రచారం చేశారు.వీరికి ధీటుగా బీ ఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విసృత ప్రచారం చేస్తున్నారు. అన్ని డివిజన్ లను ఆయన ఒక్కరే కవర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి రాష్ట్ర క్యాడర్ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు.బీజేపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ ప్రతి డివిజన్ లో ప్రచారం ఇప్పటికే పూర్తి చేశారు. ఆమె పరిధిలో ని ఏడు నియోజకవర్గా ల్లో ప్రచారం ఉదృతం చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో ఇదివరకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ ప్రచారం చేసివెళ్లారు. ఈయన ప్రచారం బీజేపీ కి ఎంతవరకు కలిసివస్తుందో త్వరలో తెలుస్తుంది.
………………………………..
దేవరకద్ర :
…………………………
దేవరకద్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నువ్వా నేనా అనే చందంగా ప్రచారం చేస్తున్నారు.ఈ నియోజకవర్గం లో భూత్పూర్, కొత్తకోట మండలాలు మున్సిపాలిటీగా ఉన్నాయి.కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ మధ్య హోరా హోరా గా పోటీ నడుస్తోంది.

……………………………….
మక్తల్ నియోజకవర్గం లో :
………………………………
మక్తల్ మున్సిపల్ ఎన్నికలు మంత్రి వాకిటి శ్రీహరి కత్తి మీద సామైంది. ముదిరాజ్ కోటాలో మంత్రి పదవి సాధించిన ఆయనకు ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యం గా మారింది. ఇక్కడ ఓటమి చెందితే మంత్రి పదవికి గండం తప్పదనే ధోరణి లో ప్రచారం చేస్తున్నారు. ఈయన పరిధిలో ఆత్మకూరు మున్సిపాలిటీ కూడా ఉండడం, రెండింట్లో గెలిచి తన రాజకీయ సత్తా చాటాలని అనుకుంటున్నారు. బీ ఆర్ ఎస్ కూడా గత వైభవం తెచ్చుకునే విధంగా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రెండు మున్సిపాలిటీ లను కైవసం చేసుకుని కెసిఆర్ ఎదుట తన ప్రతాపం చూపించుకోవాలని ఉవ్విళ్ళురుతున్నారు.బీజేపీ కూడా బలమైన క్యాడర్ ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ గా ఉన్న ఎంపీ డీకే అరుణ కూడా పట్టుదల తో ప్రచారం చేస్తున్నారు.

………………………………
నారాయణ పేట :
……………………………….
నారాయణ పేట మున్సిపాలిటీ జనరల్ స్థానం ఉండడం తో పోటీ బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, తన మేనమామ, మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ లో బీజేపీ బలంగా ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో బీజేపీ కి బలమున్న పట్టణం నారాయణ పేట. ఇది దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే పర్ణిక పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ని ఢీ కొట్టాలంటే కాస్తా కష్టమే. బీ ఆర్ ఎస్ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నలిగిపోతోంది

……………………………
కొడంగల్ :
……………………………
అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే. జిల్లా లో నియోజకవర్గం ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం తో అందరి చూపు ఇక్కడే ఉంది. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే ధీమా లో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. బీ ఆర్ ఎస్ నేతలు మాత్రం ఎలాగైనా ఇక్కడ కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ అంతంతా మాత్రంగానే ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఒక రెఫరండంగా చూస్తున్నా