Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో జాతీయ రహదార్ల కోసం రూ. 31వేల కోట్లు

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జాతీయ రహదార్ల అభివృద్ధి కోసం 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 13,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 2,722 కిలోమీటర్ల మేర జాతీయ రహదార్ల నిర్మాణం, మరో 2,526 కిలోమీటర్ల మేరు రాష్ట్ర రహదార్లను జాతీయ రహదార్లుగా అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని ఎక్స్ వేదిక ద్వారా ఆయన వెల్లడించారు. భారతమాల పరియోజన మొదటిదశ కింద రూ. 38,297 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలంగాణ వ్యాప్తంగా 1,719 కిలోమీటర్ల మేర జాతీయ రహదార్లను అభివృద్ధి చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుల వలన తెలంగాణ ప్రజలకు మొరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్ధిక ప్రగతికి, ఉపాధి అకాశాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించనున్నాయని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.