Take a fresh look at your lifestyle.

డాక్టర్ పి. సరస్వతి కన్నుమూత సి.ఆర్. ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి అంకితమైన జీవితం

డాక్టర్ పి. సరస్వతి, (వయస్సు 90 సం.)
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్
(సీ ఆర్ ఫౌండేషన్)ఆధ్వర్యంలో నడుస్తున్న హోం ఫర్ ఏజ్డ్ -వృద్ధాశ్రమం లో గత 21 సంవత్సరాలుగా నివసిస్తూ నిన్న మృతి చెందారు.
డాక్టర్ సరస్వతి గారు కంటి వైద్య నిపుణులుగా సరోజినీ దేవి హాస్పిటల్లో పనిచేసి రిటైర్ అయ్యారు.

డాక్టర్ పబ్బరాజు సరస్వతి-సుబ్బారావు దంపతులు 2004 సంవత్సరంలో సి ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో చేరారు . శ్రీ సుబ్బారావు గారు 2009 సంవత్సరంలో మృతి చెందారు. డాక్టర్ సరస్వతి ఆశ్రమంలోనే ఉంటూ సి ఆర్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యకలాపాలకు ఎన్నో విధాలుగా తోడ్పాటు అందించారు.
సి ఆర్ ఫౌండేషన్ ఆరోగ్య కేంద్రంలో ఆమె కంటి వైద్యు రాలిగా 11సంవత్సరాలు ఉచిత సేవలందించారు. సి ఆర్ పాలిక్లినిక్ మెడికల్ క్యాంపులకు, ఆశ్రమంలో వసతులు, సౌకర్యాలకు, సిబ్బంది సంక్షేమానికి వ్యక్తిగతంగా మరియు ఆర్ధికంగా తుదిశ్వాస వరకు తోడ్పాటు అందించారు. వారి కుమారుడు శ్రీనివాస్ వృత్తి రీత్యా కెనడా లో నివసిస్తున్నారు.

డాక్టర్ సరస్వతి పార్థివ దేహం రేపు ఉదయం 10 గంటలకు సి ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఆవరణలో వుంచబడుతుంది. తదుపరి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఆమె పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కు ఆమె కుమారుడు శ్రీనివాస్ చే అప్పగించబడుతుంది. విద్యార్థుల వైద్య విద్య అవసరాల నిమిత్తం తన భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కు అప్పగించాలని ఆమె గతం లోనే వ్రతపూర్వకంగా తెలియచేసారు.

Leave A Reply

Your email address will not be published.