ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్
ముద్ర, కూకట్‌పల్లి : నియోజకవర్గ పరిధిలోని హస్మత్‌పేటలో శనివారం రాత్రి గ్యారీ షరీఫ్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు
ఈ సందర్భంగా బండి రమేష్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అల్లా దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గంగా-జమునా తెహజీబ్‌కు నిదర్శనంగా నిలిచే ఇలాంటి పండుగలు మతసామరస్యాన్ని మరింత పటిష్టం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
నిర్వాహకులకు అభినందనలు
ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించిన కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని రమేష్ సూచించారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, దండుగుల యాదగిరి, మల్లికార్జున, అస్లాం, హమీద్, షహేన్షా, అశోక్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ముస్లిం పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.