Take a fresh look at your lifestyle.

ధరణీనగర్ నాలా విస్తరణ పనులను పరిశీలించిన పీయేసీ చైర్మన్

ముద్ర, శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణినగర్ నాలా విస్తరణ పనులలో భాగంగా పరికి చెరువు అలుగు నుండి ప్రేమ్ సరోవర్ అపార్టుమెంట్స్ వరకు రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెపడుతున్న నాలా విస్తరణ పనులను ఎస్.ఎన్.డి.పి ఇంజనీరింగ్ విభాగం మరియు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ పనులు చేపట్టడం వలన ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ధరణి నగర్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను వర్షాకాలం లోపు పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. గతంలో వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళననకు గురయ్యేవారని, నేడు ఆ సమస్య పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాలా విస్తరణ పనుల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా లెవల్స్ ను నిర్దారించుకొని పనులు చేపట్టాలని, వరద ముంపు మళ్ళీ పునరావృతం కాకుండా నాలల విస్తరణ నిర్మాణం పనులు చేపట్టాలని గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎన్.డి.పి ఇంజనీరింగ్ విభాగం డీఈ ధీరజ్, అరుణ్ స్థానిక నాయకులు దొడ్ల రాము, కృష్ణ గౌడ్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, రాజేష్, సంతోష్, శ్రీధర్, ఉమేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.