Take a fresh look at your lifestyle.

నైపుణ్యం లేకుండా ఉద్యోగాలు రావు

  • ఇంజనీరింగ్ విద్యార్ధులకు నైపుణ్య శిక్షణకు వినూత్న కార్యక్రమం.
  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే మరో వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ‘ప్లేస్ మెంట్ సక్సెస్ ప్రోగ్రాం’ కింద ఐదు నెలల శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయాన్ యాజమాన్యానికి ఆయన కృతజ్ణతలు తెలిపారు. గురువారం నాడు సచివాలయంలో మంత్రి సమక్షంలో దీనికి సంబంధించి హైదరాబాద్ జెఎన్ టియు – టీసీఎస్ ఐయాన్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సీటీ నెలకొల్పి యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించామని శ్రీధర్ బాబు తెలిపారు. ‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టమని ఆయన తెలిపారు. దీనిని అర్థం చేసుకున్నందునే శిక్షణ పైన దృష్టి సారించామన్నారు. చదువు పూర్తి చేసే సమయానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం పెంచగలిగితే ఉద్యోగాలు ఇవ్వడం కోసం కంపెనీలు వాటికవే పరుగెత్తుకుంటూ వస్తాయన్నారు. టీసీఎస్ ఐయాన్ సంస్థ మొదటి దశలో ప్రతి ఐదు నెలల(20 వారాల)కు వంద మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు ట్రెయినింగ్ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుందన్నారు. ఆ సంస్థతో ఎంప్యానెల్ అయిన మూడు వేలకు పైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. పైలట్ కార్యక్రమం కింద మొదట మంథనిలోని జెఎన్ టియూ కళాశాల విద్యార్థులకు ప్లేస్ మెంట్ సక్సెస్ ప్రోగ్రాం కింద నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తారన్నారు. గత ఏడాది దేశంలో యువత ఉపాధి కల్పన 44.3% in 2023 to 42.6% కు పడిపోయింది’. తెలంగాణాలో ఈ పరిస్థితి లేకుండా చూసేందుకే నైపుణ్య శిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంసిద్ధత కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అవగాహన ఒప్పంద కార్యక్రమంలో టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి, స్కిల్ ఎడ్యుకేషన్ బిజినెస్ హెడ్ స్మృతి ముల్యే, జెఎన్ టియు వైస్ ఛాన్సలర్ ప్రొ. టి కిషన్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.