- ఇప్పటికే ఏ ప్రభుత్వం చేయని పనులు, పథకాలు.
- విద్యకు అత్యంత ప్రాధాన్యం.
- తెలంగాణ ప్రజా పాలన దేశానికి రోల్ మోడల్.
- అందుకే కుల గణనను కేంద్రం చేస్తోంది.
- విద్యార్థుల కోసం మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.
- 703 హాస్టళ్లలో ఖాళీలు భర్తీ చేశాం.
- అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ.
- ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైన ఫలితాలు.
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు నియామక పత్రాలు జారీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు.అందుకే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు.గురువారం సచివాలయంలో నూతనంగా నియామకమైన 132 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నియామక పత్రాలను మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో విద్యకు రేవంత్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నామన్నారు. పెద్దఎత్తున నిధులు కూడా విద్యపై వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాల లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.విద్యార్థుల సమస్యలు ఒక్కకటి నెరవేరస్తూ ముందుకు పోతున్నామన్నారు.ఇప్పటికే మెస్ చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని పొన్నం తెలిపారు. వెల్ఫేర్ హాస్టల్ అన్నిటి కంటే మార్గదర్శకత్వం గా ఉండాలని సూచించారు బలహీన వర్గాల శాఖ మంత్రి గా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా కుల సర్వే చేశామని వివరించారు.లక్ష మంది ఉద్యోగులతో సర్వే చేసి ఎంపెరికల్ డేటా సేకరించామన్నారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిన దానిని గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి కి పంపారన్నారు. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు దేశానికి రూల్ మోడల్ గా నిలుస్తున్నాయన్నారు.ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను కేంద్రం కూడా చేస్తోందన్నారు.మునుముందు ఇంకా అనేక సంచలన నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. 703 హాస్టల్ లు ఉంటే ఖాళీల భర్తీ పూర్తి చేశామన్నారు.అన్ని డిపార్ట్‌మెంట్ లలో ఉద్యోగాలు నియామకాలు చేస్తున్నామని మంత్రి వివరించారు.
- పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశ్రమాలివి
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా నూతనంగా నియామక పత్రాలు పొందుతున్న వారికి మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలుపుతూ..మీరంతా బీసీ సంక్షేమ శాఖ కుటుంబంలో చేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఇవి సరైన ఆశ్రమాలు అని అన్నారు.తల్లిదండ్రుల లాగ పిల్లల భవిష్యత్తు ను తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు.విద్యార్థులకు కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేస్తూ వారికి భవిషత్ మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు.
- చాలా యేళ్ళ తరువాత నియామకాలు.
చాలా ఏళ్ల తరువాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నియామకాలు జరిగాయని బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ అన్నారు. హాస్టల్ లో చదువుకునే పిల్లలు బాగా చదవాలన్నా..మంచి క్రమశిక్షణ రావాలనా..హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వార్డెన్ వలే చూసుకుంటారన్నారు.ఎన్నో సంవత్సరాలుగా ఖాళీలు ఉన్నా నియామకాలు జరగలేదన్నారు.సుమారుగా 700 హాస్టల్ లు ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోకొత్త వారి రాకతో అన్ని హాస్టల్ లలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ భర్తీ జరుగుతుందన్నారు.ఛార్జి తీసుకునే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ముందుగా అవగాహన చేసుకోవాలన్నారు.వారికి అకాడమి ట్రైనింగ్ ఇన్స్టిట్ లో శిక్షణ ఉంటుందన్నారు.
ఫీల్డ్ లో ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు.ఆఫీసర్స్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా ఉందని చెప్పడానికి ఒకటే నిదర్శనం మీ దగ్గర చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నత శిఖరాలకు వెళతారన్నదే నిదర్శనమన్నారు. అదే మీ సక్సెస్ ను చూపిస్తుందన్నారు.హాస్టల్లో చదువుకునే పిల్లలు అధికారుల గురించి మంచిగా చెప్పుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు.
