Take a fresh look at your lifestyle.

ఎల్లమ్మబండలో ఘనంగా ‘క్లీనప్ డ్రైవ్’.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

​ముద్ర కూకట్‌పల్లి :
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా యువత ముందుకు రావాలని ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ASEZ WAO (దేవుని సంఘం ప్రపంచ పరిచర్య సంస్థ యువ విభాగం) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ క్లీనప్ యాక్టివిటీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
​ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, స్వచ్ఛంద సేవకుల్లో ఉత్సాహాన్ని నింపారు.
​సుమారు 150 మంది యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, వర్కర్లు ఈ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, రీసైక్లింగ్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
​ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వనరులను వాడాలని, ప్లాస్టిక్ రక్కసిని తరిమికొట్టేందుకు ప్రతి ఇంటి నుంచీ మార్పు మొదలవ్వాలని నేతలు కోరారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. “ASEZ WAO సంస్థ విద్యార్థులు ఇంతటి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. పర్యావరణ మార్పు కేవలం ఒకరోజు డ్రైవ్‌తో ఆగకూడదని, యువత నేతృత్వంలో ఈ ఉద్యమం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలి” అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చడంలో ఇటువంటి చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పులకు దారితీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

Leave A Reply

Your email address will not be published.