ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వం మెడలు వంచుతాం
సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :
ఆశ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చేలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేసిన ఘటనను నిరసిస్తూ సిఐటియు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఆశా వర్కర్ల రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాల స్వామి మాట్లాడుతూ ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీ మేరకే పోరాడుతుంటే ఆశ వర్కర్లను బలవంతంగా అక్రమ అరెస్టులకు గురిచేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత పోరాటాలకు కార్మిక వర్గం యొక్క హక్కు అని వాటిని హరించడం అంటే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే అవుతుందన్నారు.ఇలాంటి నిరంకుశత్వంతో పరిపాలన చేసిన వారు ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదని అలాంటి గతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆశలు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ ను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పరిపాలన స్తంభింప చేస్తామని హెచ్చరించారు ఈ రాస్తారోకో కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి నాయకురాలు నీరజ పద్మ భాగ్యలక్ష్మి, రేణుక, కవిత, బద్రి కవిత, శ్రీలత, వరలక్ష్మి, లావణ్య, అరుణ, శ్రీజ్యోతి, శోభ,జమున, తదితరులు పాల్గొన్నారు.