Take a fresh look at your lifestyle.

హెచ్.సి.యు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి అమానవీయం

  • వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్

వికారాబాద్ ముద్ర ప్రతినిధి: ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్.సి.యూ విద్యార్థులు మరియు ప్రొఫెసర్లను గవర్నమెంట్ అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు అని వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు అదేవిధంగా వారిపై లాటి చార్జి చేయడం అత్యంత హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను అమ్మ వద్దని చిలుక పలుకులు పలికి, ఇప్పుడు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు , కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం దుర్మార్గం అని విమర్శించారు.కెసిఆర్ హయాంలో గ్రీన్ కవరేజ్ పెరిగి, ప్రపంచంలోనే హైదరాబాద్ పట్టణం గ్రీన్ సిటీగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు.కెసిఆర్ గవర్నమెంట్ లో హరితహారం జరిగితే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో హరిత సంహారం జరుగుతుంది అని పేర్కొన్నారు.మన హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీ గా గుర్తింపు పొందింది. దాన్ని అలాగే కొనసాగించే బాధ్యత మనందరి పైన ఉంది అని పేర్కొంటూ ఇప్పటికైనా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.