Take a fresh look at your lifestyle.

మహిళను కాల్చి చంపిన దుండగులు

  • హతురాలి కుడి చేతి పై యశోద పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తింపు.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: గుర్తుతెలియని మహిళను కొట్టి చంపి ముఖాన్ని కాల్చి నీటి గుంతలు పడేసిన దారుణ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ గ్రామ సమీపంలోని పెద్ద కానల్ (వంతెన) వద్ద బుధవారం వెలుగు చూసింది . మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని మహిళను హత్య చేసి అనంతరం ముఖంపై నిప్పంటించి మృతదేహాన్ని కాల్చేందుకు దుండగులు ప్రయత్నించారు. పెద్దేముల్ మండలం కోటపల్లి ప్రాజెక్టు కెనాల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న తాండూరు రూరల్ సిఐ ఆధ్వర్యంలో పెద్దేముల్ పిఎస్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. హతురాలు వయసు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.మహిళ కుడి చేతిపై యశోధ అనే పేరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన కలకలం రేపింది. మరోవైపు మృతురాలి ఆచూకి తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.హత్యకు గురైన మహిళ వివరాలు పెద్దముల్ మండల కేంద్రం పక్కన కోటిపల్లి ప్రాజెక్టు కెనాల్ నీటి కాలువ లో ఒక గుర్తు తెలియని మహిళ చనిపోయి ఉంది.
* ఆమె వయస్సు సుమారు 35 ఉండచ్చు.
* ఆ మహిళ మొహం పై చీర వేసి కాల్చినట్లు ఉంది.
ఎవరైనా ఈ మహిళను గుర్తినట్లయితే పెద్దముల్ ఎస్సై 8712670053, తాండూరు రూరల్ సీఐ 8712670051,
తాండూరు డిఎస్పి 8712670017 నెంబర్ల కు వివరాలు తెలియజేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.