Take a fresh look at your lifestyle.

ఐజేయూ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

ముద్ర న్యూస్ బ్యూరో

చెన్నై: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్( IJU) జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం ఉదయం 10.30 గంటలకు చెన్నై వేపేరి లోని YMCA మినీ ఆడిటోరియం లో ప్రారంభం అయ్యాయి.తమిళనాడు జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు డి.ఎస్.ఆర్.సుభాష్ స్వాగతం చెప్పారు. సుప్రసిద్ధ సినీ నటి గౌతమి , సీనియర్ పాత్రికేయురాలు శశికళ రవీంద్రదాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు.లిమ్కా బుక్ రికార్డు పురస్కార గ్రహీత సుప్రసిద్ధ గరగ నృత్య కళాకారుడు సురేష్ 4,927 వ ప్రదర్శన చేశారు.ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ K. శ్రీనివాస రెడ్డి అధ్యక్షత వహించారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, ఐజేయూ మాజీ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్, ఐజేయూ కార్యదర్శులు వై నరేందర్ రెడ్డి, డి సోమ సుందర్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) అధ్యక్షుడు కే. విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఏ సురేష్ కుమార్, నగునూరి శేఖర్, డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.