Take a fresh look at your lifestyle.

కిడ్రీ మందులపై సుంకాలు తగ్గించాలి

  • పార్లమెంట్​లో ఎంపీ ఈటల రాజేందర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఔషధాల నిబంధన 377 కింద కిడ్నీ మందులపై సుంకాలు తగ్గించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ గురువారం పార్లమెంట్ లో ప్రస్తావించారు. ప్రాణాలను రక్షించే కిడ్నీ.. ఫెయిల్యూర్ థెరపీలు, మందులపై కస్టమ్స్ డ్యూటీ, ప్రభుత్వ పన్నుల మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి అని, దీనికి దీర్ఘకాలిక చికిత్స, డయాలసిస్ మరియు కిడ్నీ మార్పిడి అవసరమన్నారు. డయాలసిస్ యంత్రాలు, కిడ్నీ మార్పిడి ఔషధాల అధిక ధరల కారణంగా భారతదేశంలోని చాలా మంది రోగులు అవసరమైన చికిత్సలను పొందలేకపోతున్నారని, ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం మరియు ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ ప్రోగ్రామ్ ద్వారా కిడ్నీ రోగులకు జీవితకాల డయాలసిస్స్, కిడ్నీ మార్పిడి సేవలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని, వివిధ రాష్ట్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు డయాలసిస్, కిడ్నీ మార్పిడితో కిడ్నీ రోగులకు కూడా సహాయం చేస్తున్నాయని వివరించారు. కానీ, ఈ స్కీములకు అర్హత లేని రోగులు డబ్బులు జేబులోంచి చెల్లిస్తున్నారని, దీని వలన కుటుంబాలు భరించలేని ఖర్చులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నులు, కస్టమ్స్ సుంకాల అదనపు భారం రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక కష్టాలను మరింత పెంచుతుందని, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న రోగులను ఆదుకోవడానికి ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎంపీ ఈటల చెప్పారు.

  • కేంద్ర మంత్రితో భేటీ

కాగా, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శికావత్ తో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గురువారం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పలు అంశాలను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శికావత్ కు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.