Take a fresh look at your lifestyle.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షణీయం

మల్యాల,ముద్ర విలేకరి: రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం -2018ను సంవరించి, ఆర్డినెన్స్ తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేయడానికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అన్నివర్గాలు హర్షిస్తున్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతో స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాక లక్ష్మణ్, బీవీ రమణ పటేల్, మిలిటరీ శీను, బండి రవి గౌడ్, జంగిలి హనుమంతు, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.