ముద్ర, తాండూర్:
తాండూర్ పట్టణాన్ని డ్రక్స్ రహిత సమాజంగా మార్చటమే మనందరి బాధ్యత అని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పేర్కొన్నారు సోమవారం తాండూర్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో డ్రక్స్ పై అవగాహన కల్పిస్తూ ఇందిరా చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు 2కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును కుటుంబాల ఆనందాన్ని సమాజ భవిష్యత్తును దెబ్బతీస్తుందని కావున ప్రతి ఒక్కరూ తాండూర్ పట్టణాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చడానికి పాటుపడాలని ఆమె కోరారు. అదేవిధంగా ఎవరైనా సంఘటిత కార్యకలాపాలకు పాల్పడినట్లు కనిపిస్తే వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, వివిధ పార్టీల మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ సిబ్బంది, యువజన సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.