ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.

గురువారం తన ఛాంబర్ లో మండల తహసీల్దార్ లతో భూ భారతి, రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం బస్తాలను లారీల ద్వారా సకాలంలో మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలనీ తెలిపారు.సాదా బైనమా దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ ,రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.