Take a fresh look at your lifestyle.

నిరుపేదలకు నివాసగృహం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – కాంగ్రెస్ రాష్ట్ర నేత పొట్టోల శ్యామ్ గౌడ్

బీబీనగర్, ముద్ర:

గ్రామాలలో ఎక్కడా పేదలు నివాస గృహాలు లేకుండా ఉండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పొట్టోల శ్యామ్ గౌడ్ అన్నారు. నిరుపేదలకు గూడు కల్పించడమే ధ్యేయంగా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. బీబీనగర్ మండలం మక్త అనంతరం గ్రామానికి చెందిన కనకబోయిన నరసింహా ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పొట్టోల శ్యామ్ గౌడ్, స్థానిక సర్పంచి ధర్నాబోయిన కిలందర్ తదితరులు పాల్గొన్నారు. గృహ యజమాని దంపతులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇల్లు తమ చిరకాల వాంఛఅని, తమ కల నెరవేర్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి నరసింహా దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గ్యార మనీషా వెంకటేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగయ్య, వార్డ్ సభ్యులు వర్మ బోత్కూరి కలమ్మ సత్తయ్య , ధర్నాబోయిన శ్రీధర్, ధర్నాబోయిన కిరణ్ బింగి ఐలయ్య, బండమీద వెంకటేష్ లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.