Take a fresh look at your lifestyle.

కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేయాలి…

కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో షాపులను నిర్వహణ..
మే 31 లోపు టెండర్ వేయకుంటే ఊరుకునేది లేదు : యాదాద్రి పరిరక్షణ కమిటీ
ముద్ర, యాదగిరిగుట్ట :
కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేసి
కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొండపైన ఈవో కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్నేఏళ్లుగా కొత్త టెండర్లు లేకుండా వారి ఇష్టానుసారంగా రాజకీయ పలుకుబడితో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో దుకాణాలు నిర్వహిస్తున్నారని ఎన్నో ఏళ్లుగా రెన్యువల్ కాకుండా వీళ్ళ పలుకుబడితో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. షాపులను మే 31 లోపు వేలం వేయకుంటే జూన్ 1 నుండి స్థానిక నిరుద్యోగులు అందరూ కొండపైకి వెళ్లి కొబ్బరికాయలు పూలు, పండ్లు, వస్త్రాలు అమ్ముకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో :
సుడుగు జీవన్ రెడ్డి, కాటబత్తిని ఆంజనేయులు, దేవ పూజ అశోక్, గుండు నరసింహ , మిరియాల కృష్ణ,సతీష్ బట్టు, వంగపల్లి అరుణ్, బండి అనిల్, మందోజు నరేష్, కర్రె ప్రవీణ్ గుండు కుమార్,ఆరె కుమార్, కొనే ప్రశాంత్, గోపగాని ప్రసాద్, కర్రే శ్యామ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.