Take a fresh look at your lifestyle.

బడుగుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

  • ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సంఘ సంస్కర్తగా, బడుగుల ఆశాజ్యోతిగా బాబూ జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని బీజేఎల్పీ నేత, ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గాబాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ధుడైన జగ్జీవన్ రామ్ ఒక గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు రాజకీయవేత్త గా దేశానికి ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా సేవలందించారన్నారు. అలాగే అంటరాని వారికి సమానత్వం కల్పించుట కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, నాయకులు జమాల్, సత్యం చంద్రకాంత్, మల్లేష్, హిందూ వాహిని, భజరంగ్ దల్ సభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • కలెక్టరేట్ లో…

జగ్జీవన్ రామ్ 118 వ జయంతి పురస్కరించుకుని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకలెక్టర్ అభిలాష అభినవ్ ఘనంగా నివాళులు అర్పించారు. సమసమాజం కోసం ఎంతో కృషి చేసిన ఆయన భవిష్యత్ తరాలకు మార్గదర్శి అని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.