Take a fresh look at your lifestyle.

ఆటోలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

  • ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం.

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: ఆటోలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, దీనిలో భాగంగా లైసెన్స్ లేని ఆటో డ్రైవర్ల కు త్వరగా లైసెన్స్ ఇప్పించడం కోసం జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్ లకు డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నామని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గత నెలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్స్ కు నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం లో ఆటో డ్రైవర్లకు ఎస్పీ ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అర్హులైన వారు ఈ నెల 25వ తేది వరకు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పేర్లు నమోదు చేసుకోవాలి కోరారు. పేర్లు నమోదు చేసుకునేవారు రెండు పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు, పదో తరగతి మెమో లేదా పాన్ కార్డు వెంట తెచ్చుకోవాలి అన్నారు. సూర్యాపేట జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖ వారి సమన్వయంతో లైసెన్స్ లు త్వరగా ఇప్పించడం జరుగుతుంది.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎస్పీ సూచించారని ఎస్ఐ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు పొందలేకపోయారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. ఇతర వివరాల కోసం సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయిరాం 8712686034 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.